మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్పాల్గొన్నారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ బి.రాహూల్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రసంగిస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్, పలు రకాల పథకాలను కూడా ప్రవేశ ప్రవేశపట్టినట్టు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల్లో పని చేసిన అధికారులకు, చిన్న, ఉన్నత స్థాయి అధికారులకు ప్రశంసా పత్రలను అందజేశారు.