మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదు : పోతుల సునీత

-

ఇవాళ జనసేన వీరమహిళలతో పవన్ కల్యాణ్ సమావేశమైన నేపథ్యంలో, పోతుల సునీత స్పందించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు ఉందా? అని నిలదీశారు. పవన్ తన భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టులో శిక్షిస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, అసలు ప్రజాకోర్టు అంటే ఏమిటో పవన్ కల్యాణ్ కు తెలుసా? అని పోతుల సునీత ప్రశ్నించారు.

Pothula Sunitha: జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్  ప్రయత్నిస్తున్నారు.. - NTV Telugu

కాగా, జనసేన పార్టీ ప్రజాకోర్టు పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో వీర మహిళలతో సమావేశమైన పవన్ త్వరలోనే ప్రజాకోర్టు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఎవరైతే తప్పులు చేస్తారో.. ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద వీరికి శిక్ష పడాలి? రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది? అనే దానిపై కార్యక్రమం ఉంటుందన్నారు పవన్‌.. తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని సూచించారు పవన్‌.. అటువంటి బాధ్యతలు తెలిసేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పించాలని పిలుపునిచ్చారు.. ఇక, వాలంటీచర్‌ వ్యవస్థపై, రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు అదే స్థాయిలో వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్న విషయం విదితమే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news