హైదరాబాద్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గురించి ప్రత్యకించి చెప్పక్లర్లేదు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. గత ఏడాది ఎల్‌ఆర్ఎస్‌కు దాదాపుగా 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సైట్ విజిట్ కోసం అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఒక మెమోను జారీ చేసింది.
ధరణి పోర్టల్ వచ్చింది. ఈ పోర్టల్ వచ్చినప్పుడు ఎల్‌ఆర్ఎస్ స్కీమ్‌కు, ధరణి పోర్టల్‌కు లింకు అయి చాలా ఇష్యూస్ వచ్చాయి. దాంతో ఎల్‌ఆర్ఎస్ స్కీమ్‌ను గత సంవత్సరం నిలిపివేశారు. దాన్ని హోల్డ్ చేశారు. తిరిగి ఆ కసరత్తు అంతా పూర్తి చేశారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌తో పాటు పెంచిన రిజిస్ట్రేషన్ విలువలను ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏకకాలంలో వీటన్నింటిని రెక్టిఫై చేశారు. ఇప్పడు ఎల్‌ఆర్ఎస్ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.