విద్యార్థులకు అలర్ట్.. జనవరిలో తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌!

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. జనవరిలో తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ కానున్నట్లు సమాచారం అందుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలు పెట్టింది.

2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే 2, 3 వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్ కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news