న్యూజిలాండ్, ఇండియా మధ్య ముంబైలో జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని విధించింది భారత్. మూడో రోజు ఆటలో ధాటిగా ఆడిన భారత బ్యాటర్లు 276/7 పరుగులు వద్ద డిక్లేర్ చేశారు. దీంతో న్యూజిలాండ్ ముందు 535 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మిగిలిన రెండు రోజుల్లో లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేధించాలి. అయితే భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు క్రిజులో నిలదొక్కుకుంటారో లేదో చూడాాలి.
రెండో ఇన్నింగ్స్ లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో 62 పరుగులు చేశారు. పూజారా, శుభ్ మన్ గిల్ చెరో 47 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ చివరిలో అక్షర్ పటేల్ ధాటిగా ఆడారు. కేవలం 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 41 పరుగులు సాధించాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 325 పరుగుకలు ఆల్ అవుట్ అయ్యారు. ఆ జట్టులో అజాజ్ పటేల్ 10 వికేట్లు తీసి భారత్ ను దెబ్బ తీశాడు. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 62 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లో అశ్విన్ 4, సిరాజ్ 3 వికేట్లు తీసి న్యూజిలాాండ్ జట్టును కుప్పకూల్చారు.