తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థ.. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ

-

తెలంగాణలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చింది. జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ ఆమోద ముద్ర వేసింది. ఆ వెంటనే కేంద్ర ఆమోదానికి అనుగుణంగా బుధవారం తెలంగాణ సర్కార్‌ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. మార్పులకు ఈ సంవత్సరం ఏప్రిల్‌ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానిని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపగా.. రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది.

దీని ద్వారా జోనల్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లయింది. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి మార్గం సుగమం అయింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 50,000 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను మరో వారం లేదా పది రోజుల్లో జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం “తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) సవరణ ఆర్డర్ 2021” పై ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news