గోల్కొండ కోట కింద అద్భుతం.. భూగర్భంలో మ‌రో కోట‌..

నాలుగు వందల సంవత్సరాల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచే గోల్కొండ కోట కింద మరో అద్భుతమైన కోట ఉన్నట్టు తెలుస్తోంది. ‘సైంటిఫిక్‌ క్లియరెన్స్‌’ కోసం సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో నయాఖిలాలో 10 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ ఏఎస్ఐ ఆధీనంలోని దాదాపు 40 ఎకరాల స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా.. ఇక్కడ మరో కోట ఆనవాళ్లు బయట పడుతున్నాయి. మ‌రియు తొలి రోజు నుంచే పురాతన వస్తువులు, రాతి శిలలు బయట పడుతూనే ఉన్నాయి.

ఇవన్నీ 15వ శతాబ్దం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గోల్కొండ భూగర్భంగా మరో కట్టడం ఉందని చరిత్రకారులు, ఏఎస్ఐ అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఏఎస్ఐ సౌతిండియా రీజనల్ డైరెక్టర్ మహేశ్వరి, మరింత జాగ్రత్తగా తవ్వకాలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.