2019 హిట్ సినిమాలు ఏవంటే….??

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో భారీగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ప్రేక్షక హృదయాలు గెలుచుకుని హిట్ ని అందుకున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 గురించి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సూపర్ హిట్ కొట్టడం జరిగింది.

నాగ చైతన్య, సమంతల కలయికలో వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రలహరి అదే నెలలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. వీటితో పాటు నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఎమోషనల్ మూవీ జెర్సీ కూడా అదే నెలలో రిలీజ్ అయి హిట్ అందుకుంది. ఆ తరువాత మేలో సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అనంతరం జూన్ లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం, నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, అలానే శ్రీవిష్ణు, రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి కలయికలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించాయి. అనంతరం జులైలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ, రామ్ హీరోగా పూరి దర్శకత్వం లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మంచి హిట్ కొట్టాయి. వీటి తరువాత ఆగస్ట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు, సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన కొబ్బరి మట్ట, సెప్టెంబర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమాలు హిట్ కొట్టాయి. ఇక అక్టోబర్ లో కార్తీ నటించిన ఖైదీ సినిమా సూపర్ కొట్టి, అతడికి చాలా రోజుల తరువాత మంచి సక్సెస్ ని అందించింది…….!!