తెలంగాణ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం.. బస్సు బుక్ చేస్తే బహుమానాలు!

-

తెలంగాణ ఆర్టీసీ ని తిరిగి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా మాజీ ఐపీఎస్ సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న అప్పటి నుంచి.. అనేక మార్పులతో తెలంగాణ ఆర్టీసీ దూసుకుపోతోంది. ప్రయాణికులకు.. ఆర్టీసీ సర్వీసు దగ్గర చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

పెళ్లి శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేస్తే నూతన దంపతులకు సీల్డ్ ప్రదానం చేయాలని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం లో భాగంగానే ఇవాళ అ నూతన జంటలకు బహుమతులను ప్రధానం చేసింది ఆర్టీసీ. ఇవాళ ఒక్క రోజే ఐదు వందల వివాహాలలో 500 నవదంపతులకు ఆర్టీసీ తరఫున ప్రధానం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇక తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news