కార్తీకదీపం ఎపిసోడ్ 1194: ఎపిసోడ్ అంతా ఏడుపులే..దీప ఇక ఇంటికి రాదు, మర్చిపోండి అంటూ ఆనంద్ రావు ఆగ్రహం

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ వెళ్లిపోతుంటే ఉండొచ్చుగా కాసేపు బాబుతో ఆడుకోవా అంటుంది మోనిత. నీ బతుకు నువ్వు బతుకు గుడ్ బాయ్ అని ముందుకు అడుగువేస్తాడు..మోనిత కార్తీక్ చేయ్ పట్టుకుని ఆపి..ఆనంద్ రావు గారు మీ డాడీ వెళ్తున్నారు, నేను వస్తాను అంటావా, అక్కలతో ఆడుకుంటాను అంటావా అంటూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. సౌందర్య కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోతుంది. ప్రియమణితో ఏంటి ప్రియమణి నా వైపు జాలిగా చూస్తావ్, జాలిపడాల్సింది దీపక్క మీద, ముందు ముందు నీకే అర్థమవుతుందిలే అంటుంది.

ఇంట్లో వారణాసి కారు క్లీన్ చేస్తుండగా సౌందర్య, కార్తీక్ ఇంటికి వస్తారు. కారు దిగి గుడికి దీప వచ్చినట్లు అనిపించింది మమ్మీ అంటాడు. అదంతా నీ భ్రమ అయ్యే ఉంటుంది అని సౌందర్య కార్తీక్ ను తీసుకెళ్తుంది. వారణాసి వాళ్లతో దీప రాకపోవటంతో అక్క ఎక్కడా అనుకుని సౌందర్యతో దీపక్కా రాలేదా మేడమ్ అంటాడు. దీప మాతో ఎందుకు వస్తుంది వారణాసి అంటే..జరిగింది చెప్తాడు వారణాసి. అంటే దీప మా దగ్గరకు వచ్చిందా అని సౌందర్య అడిగితే..అవును మేడమ్..అక్క గుడిముందు మీ కారు చూసి లోపలికి వచ్చింది, మిమ్మల్ని దీపక్క కలవలేదా మేడమ్, మరి ఇంటికి కూడా రాలేదు కదా మేడమ్ అంటాడు వారణాసి. వీళ్లద్దరి మొఖాలు మాడిపోతాయి ఇగ..కార్తీక్ కు అర్థమయిపోతుంది. గుళ్లో చూసింది దీపనే అని. లోపలికి వచ్చి మెట్లపైనే కుప్పకూలిపోతాడు. అంటే దీప గుళ్లోకి వచ్చిందా, మనం చేసే పూజ చూసిందంటావా అని సౌందర్య అంటుంది. దూరం నుంచి నాకు కనిపించిందని చెప్పానుగా మమ్మీ అంటాడు. దీప చూస్తే అంతా అయిపోయిందిరా పెద్దొడ్డా అని ఏడుస్తుంది. కార్తీక్ దీప ఎక్కడకు వెళ్లి ఉంటుంది మమ్మీ, దీప వస్తుందా, దీపకు నామొఖం ఎలా చూపించాలి, వద్దూ వద్దూ అంటున్నా తీసుకెళ్లావ్ కదా మమ్మీ, దీపను ఎలానమ్మించాలి అని తలపట్టేసుకుంటాడు కార్తీక్. నా కొడల్ని నేను ఎలా అయినా వెతికి తెచ్చుకుంటాను, పూజ చేసింది నీ మంచి కోసమే అని నీకు ఎలా చెప్పాలి దీప అని సౌందర్య అనకుంటుంది.

మోనిత ఇంట్లో అద్దం ముందు నుల్చుని తననుతాగే పొగుడుకుంటుంది. నువ్వు గ్రేట్ మోనిత, కార్తీక్ తో కలిసి పూజలో కుర్చున్నావ్, మోనిత నువ్వు సూపరో సూపర్ అనుకుంటుంది. కార్తీక్ తిట్టాడుగా నన్ను అని బాబు దగ్గరకు వెళ్లి..కార్తీక్ తిడితే తిట్టావ్ గా నా కార్తీక్ వేగా. నీ పరిస్తితిని నీ మానసికి స్థితిని నేను అర్థంచేసుకోగలను, నా ప్రేమ ను అర్థం చేసుకోవటం లేదు అనుకుంటూ..మెడలో తాళికి సమాధానం నువ్వే చెప్పాలి బంగారం చెప్తావ్, చెప్పిస్తా అనుకుంటుంది.

దీప బస్తీకి వెళ్తుంది. అక్కడి వాళ్లంతా నువ్వు మళ్లీ బస్తీకి రావటం ఏంటమ్మా, ఇంత అన్యాయం ఏంటమ్మా అంటూ తలాఓమాట అంటుంటారు. దీప ఏం మాట్లాడదు. వారణాసి మాట్లాడక్కా, ఏం చేద్దామో చెప్పక్కా, మళ్లీ వంటలక్కలా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటాడు. ఇదంతా మన వంటలక్క రోడ్డుపై నడుస్తూ ఇమాజిన్ చేసుకుంది. బస్తీకి వెళ్లినా ఇంతకన్నా ఏం ఉంటుందని అనుకుంటుది.

ఇంట్లో ఆనంద్ రావు కి విషయం చెప్తారు. అంతా అయిపోయింది సౌందర్య, మొదటి నుంచి నేనైతే భయపడ్డానో అదే జరిగింది, దీప గుండె పగిలిపోయి ఉంటుంది సౌందర్య, రాదు ఇక దీప ఈ ఇంటికి రాదు అంటాడు. అలా అనకండి, దీప ఎక్కడున్న నేను వెతికి తీసుకొస్తాను అంటుంది సౌందర్య. ఏం చెప్పి తీసుకొస్తావ్ అంటూ తన భాదను వెల్లగక్కుతాడు. దీప రాదు మర్చిపోండి దీపను మర్చిపోండి అంటూ అరుస్తాడు. తప్పంతా నాదే, నేనే తప్పులమీద తప్పులు చేస్తూ వెళ్లాను, నేను దీప కాళ్లు పట్టుకున్నా దీప నన్ను క్షమించదు,ఏం చేద్దాం మమ్మీ అంటాడు కార్తీక్.

చేయటానికి ఇంకేం ఉందిరా, పరిస్థితి చేయి దాటిపోయింది, ఈ కుటుంబం పరువు బజారున పడింది, రేపటినుంచి అందరం ఇంట్లోనే ఉందాం, బయటకు వెళితే అందరూ మీ పెద్దకోడల ఏది అని అడిగే ప్రశ్నకు సమాధానం ఉండదు..నా పెద్దకొడుకు ఇంకో ఆవిడతో బిడ్డను కన్నాడని చెప్పాలి అని అనబోతాడు..కార్తీక్ చెవులు మూసుకుని డాడీ ప్లీజ్ ఆపండి అంటాడు. సౌందర్య ఆనంద్ రావుని ఆపండి, పిల్లలు వింటారు అని చెప్తుంది. రేపటి నుంచి లోకం మాట్లాడుకునే మాటలు కూా విననీవకుండా..తలుపులు, కిటికీలు మూసిపెట్టు అంటాడు.

మరోపక్క దీప రోడ్డుపై పాదయాత్ర చేస్తూ..నేను చూసింది నిజమేనా, అత్తయ్య, డాక్టర్ బాబు, మోనిత కలిసి పూజ చేస్తున్నారా అనుకుని గతం తలుచుకుంటుంది. అసలు నేను ఏం సాధించాను, పదకొండేళ్లు పొరాడితో నాకు మిగిలిందేంటి అని తనలో తనే మనోవిశ్లేషణ చేసుకుంటూ రోడ్డుపై నడుస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
-triveni

Read more RELATED
Recommended to you

Latest news