రూ.10 కాయిన్స్ ప్రస్తుతం మన దేశంలో చలామణి లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కాలం నుంచి ఈ పది రూపాయల కాయిన్స్ ను ఆర్టీసీ కండక్టర్ లు తీసుకోవడం లేదు. అవి అసలు చెల్లవని అంటూ ప్రయాణికులకు తిరిగి ఇచ్చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఇచ్చే పది రూపాయల నాణేలను ఖచ్చితంగా తీసు కోవాలని కండక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
పది రూపాయల నాణేలు చల్లడం లేదంటూ కొంత మంది కండ క్టర్లు వాటిని నిరా కరిస్తున్నారని సంస్థకు ఫిర్యాదులు రావడం, సోషల్ మీడియా లో ఆరోపణలు వస్తుండటంతో తెలంగాణ ఆర్టీసీ అలర్ట్ అయింది. దీంతో అన్ని ఆర్టీసీ బస్సులో పది రూపాయల కాయిన్స్ తీసుకోవాల్సిందేనని గురువారం సంస్థ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర.. ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.