మూడో టెస్ట్‌: రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు..

-

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించిన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ. మూడో టెస్టులో మరొక వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 132బంతుల్లో 101 పరుగు సాధించాడు. అయితే ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు.  మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు.

ఇక భార‌త్ స్కోర్ విష‌యానికి వ‌స్తే.. భారత్ జట్టు 48 ఓవర్లు ముగిసే సమయానికి 195/3తో కొనసాగుతోంది. ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. పుజారాలను ఖాతా తెరవకుండా ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఈ సమయంలో పీకల లోతు కష్ట్రాల్లో భారత్ పడింది. దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ కు రహానే తోడవడంతో భారత్ మళ్లీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news