తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సోమవారం పాఠశాల విద్యాశాఖ బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (TET) ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని గతంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2024లో మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజాగా టెట్ పరీక్షలు నిర్వహించేందుకు రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ పరీక్షలు జనవరి జరగనున్నాయి. ప్రభుత్వ టీచర్లు అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్‌లైన్ మోడ్‌లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.