దేశంలో ఇలాంటి అరాచక ప్రభుత్వం ఉందదు. కార్యకర్తలు ఓపిక పట్టండి , మన ప్రభుత్వం వస్తుంది అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పవన్ మత్స్యకారులు తో సమావేశాలు పెట్టారు. పొర్టులు, జట్టిలు కట్టాలని మాట్లాడారు. కానీ చంద్రబాబు హాయాంలొ ఒకపొర్ట్ కట్టారా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నాం అని అప్పలరాజు అన్నారు.
ఇక జువ్బలదిన్నె , ఉప్పాడ , నిజాంపట్నం అన్ని ఎక్కడ నుంచి వచ్చాయి. మేం కట్టిన హార్బర్స్ ని ప్రయివేటైజ్ చెయాలనుకుంటున్నారు. హార్బర్ల ప్రయివేటీకరణ పై చైతన్యం కావాలి. తీరప్రాంతం పుర్తిగా ప్రయివేటుకు అమ్మే ప్రయత్నం చెస్తారు. తీరప్రాంతం మత్స్యకారుడు హక్కు. గిరిజనులకు కొండల పై ఏ హక్కు ఉందో , సముద్రం పై మత్స్యకారులకు అంతే హక్కు ఉంది. అవసరం అయితే పవన్ కళ్యాణ్ ను కలుస్తాను. మీరు పోర్టులు ప్రయివేట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చాక MOUలు రద్దు చెస్తాం అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.