తెలంగాణలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు నియామకాలను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. సంగారెడ్డిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ ను హోం మంత్రి మహుమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్బంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. గతంలో పోలీస్ స్టేషన్ కు ప్రజలు రావాలంటే భయపడే స్థితి నుండి ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ వరకు ఏర్పాటు చేసామన్నారు. ఏదయినా సంఘటన జరిగిన కొన్ని నిమిషాలలోనే పోలీసులు బాధితులకు సహాయం అందుతుందని.. పోలీసుల కోసం అధునాతన వాహనాలను, సాంకేతికను ముఖ్యమంత్రి కెసిఆర్ అందించారని కొనియాడారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ శాఖ బలోపేతానికి 1000 కోట్లు నిధులను మంజూరు చేసి పోలీస్ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసి విజయం సాధించారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా షి టీం ఏర్పాటు చేసింది మన రాష్ట్రమేనని.. దేశంలోనే పోలీసింగ్ వ్యవస్థలో మన రాష్టం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిందని వెల్లడించారు. దేశం మొత్తంలో ఉన్న సిసి కెమెరాలతో మన రాష్ట్రములోనే 70 శాతం ఉన్నాయన్నారు.