ఇండియా… మీకు మేమున్నాం అంటున్న చైనా…!

కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ ఇప్పుడు గట్టిగా పోరాటం చేస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు వస్తుంది. తాజాగా చైనా కూడా సాయం ప్రకటించింది. మీకు మేమున్నాం అంటూ చైనా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శుక్రవారం ప్రధాని మోడీకి మద్దతు ప్రకటించారని అక్కడి మీడియా పేర్కొంది. కరోనా వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి చైనా సిద్ధంగా ఉందని, మద్దతు, సహాయం అందిస్తుందని అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్ కు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన మరియు ఇరుపక్షాల మధ్య హింసాత్మక ఘర్షణల నేపధ్యంలో భారత్ చైనా చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వాతావరణం ఉంది. ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, ఐసియు బెడ్స్, వెంటిలేటర్లు మరియు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న నేపధ్యంలో మన దేశంలో మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆ దేశం సహా అన్ని దేశాలు అండగా నిలుస్తున్నాయి.