తిరుపతి లడ్డు వివాదం.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరం అన్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాజాగా జగ్గారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  చంద్రబాబు నాయుడు విజనరి లీడర్. అలాంటి వ్యక్తి ఇంత మంది భక్తులును ఆందోళన కి గురి చేసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదు. లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు.  దేశ, విదేశాల్లో ఉన్న భక్తులు ఇపుడు లడ్డు తినాలా.. వద్దా అనే ఆందోళనలో ఉన్నారు.

తిరుపతిలో స్వామి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం తింటేనే భక్తులకి తృప్తి.. ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు. తిరుపతి వెంకన్న స్వామి అందరివాడు.. వైసీపీ టీడీపీ రాజకీయ గొడవల్లో శ్రీవారిని ఆలయాన్ని ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేయకండి. మీ రాజకీయాలు కొట్లాటలు వేరే సబ్జెక్టు ల మీద.. వేరే అంశాలు మీద పెట్టుకోండి. అంతే కానీ దేవుడి విషయం లో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.  ఏం జరిగిందో తక్షణమే విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు.  హిందువుల మనోభావాలను కాపాడాలని సూచించారు. తక్షణం దీనిపై  విచారణ చేసి దోషులని శిక్షంచాలి. ఈ విషయం లో రాజకీయాలు మానేయండి.  తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు విశిష్టతను కాపాడటంపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీ దృష్టి పెట్టాలని కోరుతున్నానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news