తెలంగాణలో 151 క‌రోనా కేసులు 2 మృతి

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైర‌స్ బ‌ల‌హీన పడుతుంది. అలాగే కరోనా వైర‌స్ కేసులు కూడా చాలా వ‌ర‌కు తగ్గుముఖం ప‌డుతున్నాయి. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో నిర్వ‌హించిన కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష లో 151 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అలాగే శుక్ర‌వారం ఇద్ద‌రు క‌రోన వైర‌స్ తో మృతి చెందారు. అలాగే ఈ రోజు 190 మంది కరోనా మ‌హ‌మ్మ‌రి నుంచి కొలుకున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 6,72,203 మంది కరోనా వైర‌స్ బారీన ప‌డ్డారు. అందులో 6,64,402 మంది కరోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. అలాగే నేటి వ‌ర‌కు 3,963 మంది కరోనా మ‌హ‌మ్మ‌రీ బారీన ప‌డి చ‌నిపోయారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,838 మంది కరోనా తో పోరాడుతున్నారు. అయితే దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో కరోనా వైర‌స్ వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు మేధావులు అంటున్నారు. అయితే దీపావ‌ళి పండుగ రోజు క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎంత వర‌కు ఉంటుంది అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.