అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. భారతదేశం తో పాటు అన్ని దేశాల నుంచి అమెరికా కు వచ్చే ప్రయాణికులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి తమ దేశంలో ప్రయాణ పరిమితులు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్నప్రయాణ పరిమితులను అన్నింటినీ కూడా ఎత్తివేసినట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
నవంబర్ 8వ తేదీ నుంచి భారతదేశంతో సహా అన్ని దేశాల లో గల ప్రజలు పూర్తిగా టీకాలు వేసుకుంటే సులువుగా అమెరికా కు రావచ్చు అని తెలిపింది. రెండు డోసు లు తీసుకున్న ప్రయాణికులు అమెరికా రావడానికి ఎలాంటి నిబంధనలు ఉండవు అని తెలిపింది. అయితే గతంలో కోవిడ్ టీకా తీసుకున్నా.. అమెరికా లో 7 రోజుల పాటు క్వారంటన్ లో ఉండాలనే నిబంధన ఉండేది.
అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం చేసే ఒక రోజు ముందు కోవిడ్ పరీక్ష చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానంలో ఎక్కే ముందు కరోనా వైరస్ నెగటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం మన దేశంలో 107 కోట్ల కు పైగ ప్రజలు కోవిడ్ టీకాలు తీసుకున్నారు. అలాగే అమెరికా వెళ్లాలను కున్న వాళ్లు రెండు డోసుల టీకా తీసుకుంటే అమెరికాలో ఎలాంటి ప్రయాణ పరమైన నిబంధనలు ఉండవు.