తెలంగాణ‌లో కొత్తగా 2,159 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఆగ‌డం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 2,159 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుద‌ల చేసింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,005 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా 2180 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,33,55 మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది.

కాగా, తెలంగాణ‌లో 0.60శాతం మరణాల రేటు ఉండగా, రికవరీ రేటు 80.94శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.59శాతం) కంటే ఎక్కువని పేర్కొంది. బుధ‌వారం ఒకే రోజు 53,094 శాంపిల్స్‌ పరీక్షించగా, 1032 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,29,316 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 318 నిర్ధారణ కాగా, తర్వాత రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 121, కరీంనగర్‌ 127, వరంగల్‌ అర్బన్‌లో 98 పాజిటివ్‌ కేసులు రికార్డు అయినట్లు వైద్య‌, ఆరోగ్య శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news