యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈ సారి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ ఈ సీజన్ ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ తో ఆడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం యూఏఈలో ఉన్న అర్జున్ క్వారంటైన్ పూర్తి చేసుకొని ముంబై జట్టుతో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్జున్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ముంబై ఆటగాళ్లతో అర్జున్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్నారు.