వామ్మో… 3 లక్షల ఎకరాలా… ఎవరా శ్రీ?

ప్రస్తుతం రాష్ర్ట రాజకీయాలన్నీ హుజురాబాద్ ఉప ఎన్నికల చుట్టేతే తిరుగుతున్నాయని భావస్తే అది చాలా పొరపాటు అవుతుంది. ప్రస్తుతం రాష్ర్టంలో మరో పంచాయతీ నడుస్తోంది. అదేంటంటే భూముల పంచాయతీ. రాష్ర్ట ప్రభుత్వం భూముల పంచాయతీలు ఉండకూడదని ధరణి వెబ్ సైట్ కు రూపకల్పన చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలా రాష్ర్ట వ్యాప్తంగా ఈ భూముల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి.

అసలు ఈ భూముల పంచాయతీలకు కారణం ఎవరై ఉంటారనే అనుమానం చాలా మందిలో కలిగి ఉంటుంది. అదే విషయం గురించి ఆరా తీస్తే అసలు ఆ వ్యక్తి ఎవరో సర్కారు ఆఫీసర్లకు కూడా తెలియకపోవడం విడ్డూరం అంతలా రాష్ర్ట వ్యాప్తంగా కేవలం ఒక్కరంటే ఒక్క వ్యక్తి ఎకరం, కాదు రెండెకరాలు కాదు ఏకంగా మూడు లక్షల ఎకరాలను తన పేర రిజిస్ర్టషన్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్నారా. అతడే శ్రీ. రాష్ర్ట వ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు సంచలనం రేకెత్తిస్తోంది. అసలు ఆఫీసర్లకు కూడా తెలియని ఈ వ్యక్తి తండ్రి సంబంధీకుల పేర్లు కూడా శ్రీ అని ఉండడం గమనార్హం. ఇలా ఈ శ్రీ అనే పేరు ప్రస్తుతం రాష్ర్ట రాజకీయ వర్గాల్లో రెవెన్యూ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. భూముల వివరాలు సరిగ్గా ఉండాలనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం భూములను రీసర్వే చేయించింది. మరలా వివరాలను నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి యాప్ లో పొందుపరిచింది. ఇలా మరలా సర్వే చేసినపుడు కూడా వివరాలు శ్రీ అనే ఉండడం విడ్డూరం. దీని గురించి రెవెన్యూ అధికారులను అడిగితే తమకు తెలియదని సమాధానమిస్తున్నారు. రాష్ర్టంలోని చాలా చోట్ల లీడర్లు అక్రమ పత్రాలను క్రియేట్ చేసి రైతు బంధు, రైతు బీమా డబ్బులను ఖాజేయడం మరో విశేషం.