హైదరాబాద్‌ లో మందు బాబు హల్చల్…నగ్నంగా పోలీసులపై !

-

బ్రేకింగ్ : హైదరాబాద్‌ లో మందు బాబు హల్చల్ చేశాడు. నగ్నంగా పోలీసులపై దారుణనికి ఒడిగట్టాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని మలక్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మందు బాబు నగ్నంగా హల్చల్ చేశాడు.

దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ ఓ మందు బాబు మద్యం మత్తులో తన గుడ్డలు ఊడదీసి నగ్నంగా పోలీసులపై తిరగబడుతూ బూతులు తిట్టాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో భాగంగా తనిఖీలు చేస్తుండగా ఓ మందు బాబు హల్చల్ చేశాడు.

దీంతో ట్రాఫిక్ కాప్స్ ఆవక్కాయ్యారు. ఈ సంఘటన దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద చోటు చేసుకుంది. అయితే.. మందుబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అంతేకాదు…ఆ మందుబాబు వాహనాన్ని సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. అనంతరం మందుబాబు కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. అతన్ని వదిలేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news