కేసీఆర్‌ పాలన.. పాలమీద మీగడ.. వైరల్‌ అవుతున్న రైతన్న పాట

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు , అభివృద్ధిపై ఓ రైతు జానపాద గేయంలో పాటిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఓ రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పోలానికి వచ్చి పొలం గట్టుపై నిలబడి కేసీఆర్‌పై ఓ పాటను పాడి ఆకట్టుకున్నాడు.. ముందుగా కేసీఆర్‌ అంటే తనకు చాల ఇష్టమని పాట మొదలు పెట్టారు. ‘కేసీఆరూ మాటలు బంగారు మూటలు.. జల్లుజల్లునా రాలే ఎన్నోన్నో వరాలు .. దైవ స్వరుపుడివని నమ్ముతున్నామయ్యా చల్‌’’ అంటూ కేసీఆర్‌ను దైవంతో సమానంగా పొల్చుతు పాడారు. ఎలాంటి కల్మషం లేని ఆదర్శప్రాయుడని కొనియాడారు.

ఎగురుతూ గెంతెత్తుతూ..

నిర్మలమైన కేసీఆర్‌ జన్మంటూ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణలో పాడి పంటలతో కళాకళలాడుతుందని ఆకాశ గంగమ్మా, భూదేవీకి ధన్యవాదలని.. సకాల దేవతలందూ సంపూర్ణ మద్దతు సీఎం కేసీఆర్‌కు కల్పించాలని పాటలో విన్పించారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా పాలన కొనసాగుతుందని.. గుళ్లు, మసీదులు, చర్చిలలో సకాల సౌకర్యాలు కేసీఆర్‌ కల్పిస్తు అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నారన్నారు. ఇంతలో ఓ మహిళ పాటను అడ్డుకుంటుండగా ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయి పాటను కొనసాగించారు. సంక్షేమ ఫలాలకు ఎన్ని అడ్డంగులు వచ్చిన వాటిని అమలు పరుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతున్నారన్నారు.త్వరలోనే రాష్ట్ర ప్రజలందరూ సకాల సంపన్నులు అవుతారన్నారు. కేసీఆర్‌ పాలన పాలమీద మీగడ లాంటిందని నాలుకకు రుచి తగిలిన అమృతం కేసీఆర్‌ పాలన ఉందని జీవితాంతం కేసీఆర్‌ను మరవలేరన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అడిగినా కేసీఆర్‌ పాలనే బాగుందని పాట రూపంలో వినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news