ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త.. వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ లు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.

దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మొత్తం శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేయనుంది. వికలాంగుల సంక్షేమంపై మరింత దృష్టి సారించి ఎందుకు వీలుగా ఈ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు.