సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్..ఇప్పటికే ఆమె పెళ్లి !

-

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి యువతి కిడ్నాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసిన జాన్ అనే వ్యక్తి శాలిని పెళ్లి చేసుకోగా అప్పటికి యువతి మైనర్ కావడంతో తల్లిదండ్రులు..కేసు పెట్టారు.

అయితే, పది నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన జాన్.. యువతిని కిడ్నాప్ చేశాడు. ఇక నిన్న వేరే యువకుడితో శాలినికి నిశ్చితార్థం కావడంతో తెల్లవారు జామున జాన్ తన స్నేహితులతో కలిసి వచ్చి కిడ్నప్ చేసినట్లు గుర్తించారు వేములవాడ పోలీసులు. ఇక కిడ్నాప్ అయిన యువతి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news