పనిమనిషిపై కన్నేసిన యువకుడు..దారిలో అడ్డగించి..

-

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పనిమనిషిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ పరిధిలోని నాదర్గుల్ లో ఓ మహిళ స్థానికంగా నివాసం ఉంటుంది. నాలుగు ఇళ్ళలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. బుధవారం ఉదయం రోజు లాగే నడుచుకుంటూ పని చేయడానికి వెళుతుండగా.. ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఎమ్ వి ఎస్ ఆర్ కళాశాల సమీపంలోనికి వెళ్లగానే ఓ యువకుడు అడ్డుకొని ఆమె చేతులు పట్టుకొని అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ మహిళ వెంటనే కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్తున్న వారు రాగానే ఆ మహిళను వదిలేసి నిందితుడు పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయి రామ్ నగర్ కాలనీ ఫేస్ వన్ టిఅర్ఎస్ ప్రెసిడెంట్ మహేందర్ అనుచరుడు అర్జున్ గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news