టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను రెండు రోజుల కిందట ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లా తెల్దార్ పల్లి లో 144 సెక్షన్ విధించారు. అయితే… తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఈ నిందితులను ఆంధ్ర ప్రదేశ్ లో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులను పట్టుకోవడం కోసం ఎసిపి శభరీష్ నాయకత్వంలో ఒక్క టీం ఆంధ్ర ప్రదేశ్ కు తరలి వెళ్లింది.
గత మూడు రోజుల నుంచి ఆంద్రప్రదేశ్ లోని పలుప్రాంతాల్లో ఉండి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈకేసు కు సంబందించి నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతంది. ఈ తెల్ల వారు జామున వీరి అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది. వారి అక్కడ నుంచి ఖమ్మం కు తీసుకుని వచ్చి ఇంటరాగేషన్ చేయనున్నారు.