బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు ఇప్పటికే ఓసారి బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

అయితే తాజాగా మరోసారి రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల బెయిల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రేపు నిందితుల బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. అయితే రేపు హైకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వనుందో వేచి చూడాలి.