పీవీ మన ఠవీ అని అసెంబ్లీ సాక్షిగా కొనియాడిన కేసీఆర్ భారతదేశ ప్రతిష్టని పెంచారని, ఎన్నో సంస్కరణలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పీవీ ప్రస్థావన తీసుకువచ్చిన కేసీఆర్ తెలంగాణ ముద్దు బిడ్డ పీవీకి భరతరత్నివ్వాలని మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిపై కేసీఆర్‌తో పాటు పలువురు గులాబీ నేతలు స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సండ్ర వెంకట వీరయ్య ఈ సందర్భంగా పీవీ సేవల్ని కొనియాడారు. పీవీకి భారతరత్నం ఇవ్వాల్సిందేనని, ఆయన అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు.
కేసీఆర్ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ అంతా ముక్త కంఠంతో ఆమోదించింది. అయితే ఇంతగా జరిగిన ఈ చర్చకు తెరాస మిత్ర పక్షం ఎంఐఎం గైర్హాజర్ కావడం చర్చనీయాంశంగా మారింది. మిత్రులుగా వుంటూ కీలక చర్చ జరుగుతున్న వూళ ముఖం చాటేయడం ఏంటని, ఎంఐఎం ది ఇదేం రాజకీయమని పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసమే గులాబీ పార్టీతో ఎంఐఎం దూరాన్ని మెయింటైన్ చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.