అక్కినేని నాగ చైతన్య కార్ కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్….

-

సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ఎవరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా… తగ్గేదేలేదు అన్న రీతిలో జరిమానాలు విధిస్తున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు పాటించని వారిని ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. కార్లపై స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలకు ఫైన్స్ విధిస్తున్నారు. గ్లాసెస్ కు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను అక్కడిక్కడే తొలగిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు కూడా జరిమానాలు విధించారు.

తాజాగా అక్కినేని నాగచైతన్య కారులకు ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. సోమవారం జూబ్లీ హిల్స్ లో తనిఖీల సమయంలో అటుగా వచ్చిన నాగచైతన్య కారును ఆపి జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి… రూ. 700 ఫైన్ వేశారు. బ్లాక్ ఫిల్మ్ తో పాటు వాహనాలపై ప్రెస్, డాక్టర్ ఇలా స్టిక్కర్లు ఉన్న వాహనాలకు ఫైన్ వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రెటీలు  మంచు మనోజ్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ వాహనాలకు జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news