కాంగ్రెస్‌ 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

-

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలు వరుస ర్యాలీలు, సభలు, రోడ్షోలతో జోరు సాగిస్తున్నారు. కొందరు అభ్యర్థులకు మద్దతుగా కీలక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు పరస్పర విమర్శలతో ఎన్నికల వేడిని మరింత పెంచేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

ఈ క్రమంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని తాజాగా విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పది ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ 14 సీట్లు గెలుస్తుందంటున్నారని, అదే జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్‌ చేశారు. హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్లకు సంబంధించిన స్థలం లీజును ఓ సంస్థకు రద్దు చేసి, తిరిగి అదే సంస్థకు అప్పజెప్పడంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీనిపై సీఎం నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news