బిడ్డా అమిత్ షా.. మునుగోడు కి ఎందుకు వస్తున్నావు – సీఎం కేసీఆర్

-

మునుగోడులో టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ ప్రారంభమైంది. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేదికపై అమరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఒకప్పుడు ఫ్లోరైడ్ తో బాధపడ్డ ప్రాంతమని.. రాష్ట్రం వచ్చాక ఆ నీళ్ల బాధ పోగొట్టుకున్నామని అన్నారు. మునుగోడు ను ఫ్లోరైడ్ రహితర ప్రాంతంగా మార్చామన్నారు. ఫ్లోరైడ్ సమస్యను గతంలో ఎవరు పరిష్కరించలేదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు.

మన అధికారాన్ని ఎవరికో అప్పగించవద్దు.. సీరియస్ గా ఆలోచించాలని అన్నారు కేసీఆర్. ఎవరి మంచి కోరి ఉపఎన్నిక వచ్చిందని.. దీని వెనుక మాయా మశ్చింద్రా ఏంటో గుర్తించాలన్నారు. కమ్యూనిస్టులతో మాట్లాడానని.. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నామన్నారు. కమ్యూనిస్టులు కలిసి రావాలి.. వారు టిఆర్ఎస్ కి మద్దతు ఇస్తామన్నారని తెలిపారు. రైతుల బతుకులు బాగుండాలంటే కమ్యూనిస్టులు కలిసి రావాలన్నారు. బిడ్డా అమిత్ షా.. నువ్వు ఎందుకు మునుగోడుకి వస్తున్నావు, ఏం ఉద్ధరించేందుకు వస్తున్నావు అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news