కేసీఆర్ గుర్తుంచుకో..తెలంగాణలో బీజేపీదే అధికారం – అమిత్ షా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ నా మాటలు గుర్తించుకో… తెలంగాణలో అధికారం నీది కాదు, నీ కొడుకుది కాదు… బిజెపి పార్టీది అని పేర్కొన్నారు అమిత్ షా.

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ముస్లింల నుంచి తెలంగాణ విమోచనం పొందిందని.. అప్పుడు సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో కూడా బిజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. రాజకీయాలను సేవ కోసం వినియోగిస్తాం.. బిజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఫైర్‌ అయ్యారు అమిత్‌ షా.