ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో జగనన్న గృహ నిర్మాణ కాలనీపై అక్రమాలపై విచారణ అదేశించామని.. హౌసింగ్ ఎండీ, జిల్లా కలెక్టర్ తో నివేదిక ఇవ్వాలని అదేశించామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత నకిలీ లబ్ధి దారులను తొలగించి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక అంతకుముందు దీనిపై టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ… పులివెందులలో జగనన్న గృహ నిర్మాణ కాలనీలో 2 వేల మంది నకిలీ లబ్ధి దారులు ఉన్నారని… 100 కోట్లు పైన ఉన్న ధనవంతులకు వీటిని కేటాయించారని ఆరోపణలు చేశారు.
366 ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు కేటాయించారు… ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేయకుండా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. వేరే జిల్లాల నుంచి బంధువుల పేర్లను కూడా తీసుకువచ్చి కేటాయింపులు జరిపారు… 150 కోట్లు మేర అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై JC గౌతమి సహా ఇతర అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి.