తెలంగాణ సెంటిమెంట్ తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కారు పార్టీకి మూడోసారి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అయితే ఇదే విషయమై ఓ చానెల్ డిబేట్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్ లో ఈ రోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటు వేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు హైదరాబాద్ లో ఇవ్వలేదన్నారు. ఈ విషయం లో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే కూడా తెలివైన వాళ్లని.. వారంతా చైతన్యవంతులు కాబట్టే సరైన నిర్ణయం తీసుకుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ జగన్ కి మద్దతుగా మాట్లాడినట్టా..? లేక చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడినట్టా అని అందరూ అర్థం కాకుండా అయోమయంలో ఉన్నారు. ఏపీలో కొన్ని సర్వేలలో కూటమి విజయం సాధిస్తుందంటే.. మరికొన్ని సర్వేలు వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొంటుండటం గమనార్హం.