మునుగోడులో మరో 19 లక్షలు పట్టివేత..కాంగ్రెస్ పార్టీకి చెందినవే !

-

మునుగోడు ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఆ నియోజక వర్గంలో.. డబ్బులు ప్రవాహం కొనసాగుతోంది. ఇక తాజాగా మరో 19 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ శివారులో 19 లక్షలు పట్టుకున్నారు పోలీసులు.

గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే… TS 07 FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న 19 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. ఇక కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని డబ్బుపై విచారిస్తున్నారు పోలీసులు. అంతేకాదు… కారులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ లభ్యం అయిందని పోలీసులు తెలిపారు. కాగా.. నిన్న బీజేపీ కి చెందిన కోటి రూపాయలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news