ఉత్తరాంధ్ర నుంచి మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికు చెందిన గరికపాటి వెంకట్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం దిక్కులేకుండా పోయింది. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ తో కలిసి ఉండటం వల్ల రాలేకపోతున్నట్టు కొందరూ చెబుతున్నారు. మత, వివక్ష చూపించనని మాట ఇస్తున్నాను.
ముస్లింలను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడను. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతాను. కులం, మతాన్ని దాటి వచ్చాను.. మానవత్వాన్ని నమ్మాను. అన్ని పార్టీలను చూశారు. ఒక్కసారి జనసేనను నమ్మాలని ప్రజలను కోరుతున్నాను. మాట ఇస్తే వెనక్కి తగ్గను. అన్ని ఆలోచించిన తరువాత మాట ఇస్తే వెనక్కి తగ్గను. అన్నీ ఆలోచించాకే మాట ఇస్తాను.. రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను. గనులు తవ్వుకుని వెళ్లిపోతున్నారు.. తప్ప ప్రకాశం జిల్లా అభివృద్ధికి నాయకులు కృషి చేయడం లేదు.