చెప్పిన విధంగానే, మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

-

మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయ దుందుభి మ్రోగించారు. అయితే.. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల హామీలో భాగంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని ట్విటర్ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. ముందుగా తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.

టిఆర్ఎస్ పై, కేసీఆర్ పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాను చెప్పిన హామీ ప్రకారం మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news