తెలంగాణలో రామరాజ్యం రావాలి : అసోం సీఎం

-

తెలంగాణలో రామరాజ్యం రావాలని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రజాకార్లను తలపించే పాలన నడుస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దానికి స్వస్తి పలికి బీజేపీ నేతృత్వంలో రామరాజ్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ముందుచూపుతో దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని తెలిపారు. కరోనా సమయంలో అన్ని రంగాలను సమున్నతంగా నిలిపిన ఘనత మోదీదని ప్రశంసించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన ‘హిందూ ఏక్తాయాత్ర ర్యాలీ’కి అసోం సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సూర్యచంద్రులున్నంత వరకు దేశంలో హిందుత్వం, సనాతన ధర్మం ఉంటాయని హిమంత చెప్పారు. దేశంలో హిందూ సమాజం జాగృతమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. చిన్న రాష్ట్రమైన అసోంలో లీటరు పెట్రోలు ధర రూ.97 ఉండగా.. ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణలో రూ.108కి విక్రయిస్తున్నారని విమర్శించారు. తమ రాష్ట్రంలో ఇటీవలే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, త్వరలో మరో 50 వేలు ఇస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news