కర్ణాటక ఫలితాలపై విజయశాంతి వివాదస్పద ట్వీట్ చేశారు. కర్ణాటక ఫలితాల్లో ముస్లిం మైనార్టీల ఓటింగ్ తమకు గెలుపునిచ్చింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి టీవీ డిబేట్‌ల చెప్పటం తప్పు కాదు… తమ గెలుపుకు అనుకూలించిన పరిస్థితులను ఆ పార్టీ ప్రస్తావించడం ధర్మమేనని తెలిపారు. ఆ పార్టీ విశ్లేషణ మేము తప్పబట్టదగింది కాదు. అయితే అదే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా రావాలంటే, ఇక్కడ ముస్లిం మైనార్టీల ప్రాధాన్యత కాంగ్రెస్ కన్నా బీఆరెస్ వైపు అన్నది గత కొన్ని ఎన్నికల వాస్తవం అన్నారు.
ఆ కర్ణాటక ఫలితాలు తెలంగాణలో తేవాలంటే బీఆరెస్ నుంచి తమ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి ఇంకెన్ని ప్రయత్నాలు చెయ్యాలో… చేస్తారో ఆ పార్టీకే తెలియాలి. అయితే భవిష్యత్ తెలంగాణ ఎన్నికల పోరాటం… ఆ తర్వాత బీఆరెస్, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన ప్రయత్నానికి, ప్రత్యామ్నాయమైన బీజేపీ వైపు మెజారిటీ ప్రజల నిర్ణయానికి మధ్య ఫలితంగా రేపటి వాస్తవం తప్పక ఉండవచ్చు. ఏది ఏమైనా తెలంగాణల బీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎం సయామీలు ఒకవైపు… బీజేపీ ఒకవైపు అనే అభిప్రాయం ఇప్పటి నుండీ మరింత ఎక్కువగా ప్రజలలోకి పై 3 పార్టీల ధోరణితో కనపడవచ్చు. బీజేపీ మొత్తం భారత ప్రజలను ఒక్క జాతిగా చూస్తున్నప్పటికీ, ఈ విభజన ధోరణుల పార్టీల సిద్ధాంతం నుండి సమైక్యతా భారతం వైపు జరిగే ప్రయత్నాలు నిరంతరం కొనసాగాల్సిందేనన్నారు విజయశాంతి.