కెసిఆర్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి – ఎంపీ అరవింద్

సీఎం కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్ విసిరారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్.
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో బిజెపి నేత మల్లికార్జున్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ రద్దు చేసిన తక్షణమే తెలంగాణలో రాష్టప్రతి పాలన వస్తుందన్నారు. పనికి ఆహార పథకం కింద పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆరెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే నాపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ అరవింద్. పేరుకు రైతు బంధు ఇస్తూ మిగితా స్కీములు అన్ని కట్ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. నామీద పోటీ చేసే వాళ్ళు ఓటుకు 10వేలు పంచేలా చేస్తానన్నారు అరవింద్. పేదల పైసలు తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ప్రధాని మోదీ మొన్న బేగంపేట లో చెప్పారని తెలిపారు. కమిషనర్ నుండి కానిస్టేబుల్ వరుకు ఒత్తిడితో పని చేస్తున్నారని అన్నారు.