వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన.. !

-

వ‌రంగ‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో బీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ వరంగల్ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది. కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాల‌ని బీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించవద్దంటూ, ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మేయర్లు, కార్పొరేటర్లు,  కౌన్సిలర్లు, చైర్మన్లు ఇలా మూకుమ్మడిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మాణం కూడా ప్రవేశపెట్టారు. దాదాపు అన్ని చోట్ల అవిశ్వాస తీర్మాణాన్ని అధికార పార్టీ విజయం సాధించింది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే విజయం సాధించింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news