జూపార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 ఫైన్ విధిస్తామని అధికారులు స్పష్టం చేసారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈనెల 06 నుంచి తెరుచుకుంటుంది. లాక్ డౌన్ తో మార్చ్ 15న మూతబడ్డ జూ పార్కు ను తిరిగి అక్టోబర్ 06 నుంచి తెరవనున్నట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. సందర్శకులు మాస్క్ ధరించాలని లేకుంటే లోపలికి అనుమతించేది లేదు అని స్పష్టం చేసారు.
ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని కోరారు. వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు రాకూడదని స్పష్టం చేసారు. జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. కాగా కరోనా నిబంధనలను పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తారు అధికారులు.