మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్ పై బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ముందస్తు ఎన్నికల విషయంలో తన తండ్రి కెసిఆర్ తో ప్రకటన చేయించాలని మంత్రి కేటీఆర్ ని కోరారు బండి సంజయ్. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు నోటికి వచ్చిన అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ రాని వద్ద గ్రామాల పేర్లు చెప్తానని, వచ్చే ఐదు గ్రామాల పేర్లు చెప్పాలన్నారు.

నిజంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రైతు ఆత్మహత్యలలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, రైతు బీమా కేసుల్లో 10,000 మంది అన్నదాతలవి ఆత్మహత్యలేనని తేలాయ్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. రాబోయే ఎన్నికలలో బిజెపి విజయం తద్యమని జోష్యం చెప్పారు.