రాములమ్మపై బండి సంజయ్‌ పొగడ్తలు..పార్టీలో చేరికపై క్లారిటీ వచ్చినట్లేనా?

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నారు..ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి..ఒకే వైపు ప్రధాన పార్టీలన్ని ప్రచారంపై ఫోకస్‌ పెట్టినప్పటికి..తెరవెనుక మాత్రం పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఇప్పటికే బీజేపీ నుంచి కీలక నేతలు కారెక్కారు..అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి..నెట్టింట్లో అవి విసృతంగా ప్రచారం అయ్యాయి..రాములమ్మ వివరణలో అప్పుడు కొంచెం ఊహగాణాలు తగ్గినప్పటికకి తాజాగా రాములమ్మపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పోగడ్తతలతో తాజాగా..కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా చర్చ నడుస్తుంది..


ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి గురించి మీడియా ఎదుట ప్రస్తావించారు.. రాములమ్మను బండి సంజయ్‌ పొగడ్తలతో ముంచెత్తారు..తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని.. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్‌ పేర్కొన్నారు.. రాములమ్మ బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి..త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరవచ్చుననే చర్చ ప్రజల్లో జోరుగా నడుస్తుంది..గ్రేటర్‌ ఎన్నికల ముందే ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి..రాములమ్మ చేరికపై బీజేపీ అధిస్ఠానం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది..రాష్ట్రపార్టీ నేతల అభిప్రాయంపై బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహగాణాలు వస్తున్నాయి..ఏది ఏమైన ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తేంటే.. త్వరలోనే రెండు జాతీయ పార్టీలకు రాములమ్మ షాక్‌ న్యూస్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుందిని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.