పరీక్షలు రాయని ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్

-

తెలంగాణాలో ఇంటర్‌ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా వ్యాప్తంగా 27, 589 మంది విద్యార్థులను గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరు కాని 27, 251 మంది విద్యార్థులు, అలానే ఇంటర్ బోర్డు మాల్‌ ప్రాక్టీస్‌ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు తీర్మానించింది.

 

కొవిడ్‌ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇక వీరికి ఎంసెట్ లాంటివి అయితే ఈ ఏడాదికి లేనట్టే,ఎందుకంటే దాదపు అన్ని ఎంట్రెన్స్ పరీక్షల ప్రక్రియలు పూర్తి అయ్యాయి. అలంటి వాళ్ళు చదువుకోవాలి అంటే మేనేజ్మెంట్ కోటాలో చదువుకోవాల్సి ఉంటుంది. లేదా డిగ్రీ లాంటి కోర్సులకు వెళ్ళవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news