సీఎం కేసీఆర్ ను హెచ్చరిస్తూ… బండి సంజయ్ బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని..ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని ఈ లేఖ ద్వారా పేర్కొన్నారు బండి సంజయ్.

 

తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి జులై 1 నుండి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని.. ఈనెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతోపాటు 3 నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై 1 నుండి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోండని కోరారు.

రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్దిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? అని నిలదీశారు. మీ ప్రభుత్వానికి కొద్ది నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది… అయినా హమీలను అమలు చేయకపోవడం ప్రజలను దారుణంగా వంచించడమేనని.. ఈనెల 9న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిపై చర్చించి తక్షణమే అమలయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news