55 శాతం బీసీలు ఉన్న తెలంగాణలో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు – బండి సంజయ్

-

55 శాతానికి పైగా వున్న బీసీ జనాభా వుంటే తెలంగాణ అసెంబ్లీలో కేవలం 22 మంది సభ్యులు, మంత్రి వర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే వున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్‌. జనాభాలో 50 శాతానికి పైగా వున్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అణిచివేస్తుందని… ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌.

బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో నామామాత్రంగా నిధులు కేటాయిస్తున్నారు… వాటిలోనూ 10శాతం కూడా ఖర్చుపెట్టడం లేదని విమర్శలు చేశారు బండి సంజయ్‌. బీసీసబ్‌ప్లాన్‌ తెస్తామని 2017 బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ ప్రకటించిన ఇప్పటివరకు అతీగతీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్‌. 2017 లో ఏర్పాటు ఎంబీసీ కార్పోరేషన్‌కు గత నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చు చేసింది రూ.10 కోట్లకు మించిలేదని… ఎంబీసీ లోన్ల కోసం 13,369 మంది ధరఖాస్తు చేసుకుంటే 1,419 మంది మాత్రమే ఋణాలు పొందారని మండిపడ్డారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news