లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారు. అందుకే సింఘ్వీని తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అని పేర్కొన్నారు బండి.
అలాగే కేసీఆర్ చెప్పినోళ్లకే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు. అంతేకాని బీజేపీకి, కవిత బెయిల్ కు సంబంధమే లేదు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అవినీతి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నయి. మేం 6 గ్యారంటీలు, రుణమాఫీపై నిలదీస్తుంటే… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజీవ్ గాంధీ విగ్రహం పేరుతో లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన గుణ పాఠం చెబుతారు అని బండి సంజయ్ అన్నారు.